కేంద్ర ప్రభుత్వ పథకాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనింగా వ్యవహరిస్తుందని బీ.జే.పీ. రాష్ట్ర అధ్యక్షులు పురందేశ్వరి మండిపడ్డారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 22 లక్షల ఇళ్లను కేంద్ర ప్రభుత్వం అందిస్తే రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఎన్ని ఇల్లును నిర్మించిందో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఆమె మాట్లాడుతూ… గడచిన పది సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఏ ఒక్క అవినీతి మచ్చ లేకుండా సుపరిపాలన అందించిన ఘనత భారతీయ జనతా పార్టీదే అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ ద్వారా అందించే నిధులను దారి మళ్లించిందని ఆరోపించారు. వాస్తవానికి రాష్ట్రంలో గృహ నిర్మాణానికి అందించే 1,80,000 కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సాయి మని అని అన్నారు.
కేంద్ర పథకాలపై రాష్ట్రం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది…. -పురందేశ్వరి-

