Viral

కెనాల్ పై అనధికార వంతెనల నిర్మాణం…!!! -పౌరసంక్షేమసంఘం-

WhatsApp Image 2024-03-22 at 5.04.05 PM

సామర్లకోట జాతీయ రహదారి కెనాల్ పై అనధికారికంగా రోజుల వ్యవధిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బ్రిడ్జీలు నిర్మించడం జరుగుతున్నదని పౌరసంక్షేమసంఘం పేర్కొంది. కాని జిల్లా యంత్రాంగం ఏమీ తెలియనట్టు దృతరాష్ట్ర చందం కావడం దురదృష్ట కరమని పౌర సంక్షేమ సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. 2005 లో అనుమతులు లేకుండానే సిమెంటు తూరలు వేయగా నాలుగు ప్రాంతాల్లో సిమెంటు తూరల మార్గాలు ఏర్పాటు అయ్యాయని అదే త్రోవలో మేడలైన్ అక్రమ వంతెన ఏర్పడిందన్నా రు.

ఇప్పుడు సిమెంటు తూరల స్థానంలో స్తంభాలు నిలిపి బ్రిడ్జిలు నిర్మించడం వరకు వచ్చిందన్నారు. కాకినాడ సిటీలో కార్పోరేషన్ ఆస్తిగా వున్న సినిమా రోడ్ లోని సంతచెరువు కార్నర్ ను రెండు వేల గజాల స్థలాన్ని ఆక్రమించరన్నారు. దేవాదాయ శాఖ పరిధిలో వున్న అక్కడి పూర్వ ఆలయం తీసివేసి కొత్తగా కనకదుర్గ ఆలయాన్ని నిర్మించి మరిన్ని షాపులను నెలకొల్పి అమ్ముకున్న మాఫియా దుస్తితి ఏర్పడిందన్నారు.

ఒకవైపు కాకినాడ రూరల్ లోని సామర్ల కోట కెనాల్ పై నీటి పారుదల శాఖ జాతీయ జలవనరుల శాఖ అనుమతులు లేకుండా రోజుల వ్యవధిలో ఆధునిక సాంకేతిక టెక్నాలజీ వినియోగించి అనధికారకంగా బ్రిడ్జీలు నిర్మించారని అన్నారు. ఇది ఎవరి ప్రమేయంతో జరుగుతున్నదని పౌర సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణరాజు ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత అధికారులు విచారణ చేయాల్సిన అవసరం వుందన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.