ఖలిస్థాన్ అనుకూల వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జార్‌ను హతమార్చిన కేసులో ముగ్గురు భారతీయులను అరెస్టు చేసిన నేపథ్యంలో కెనడా ఒక చట్టం పాటించే దేశం అని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అన్నారు. కెనడా ఒక బలమైన, స్వతంత్ర న్యాయ వ్యవస్థతో పాటుగా తన పౌరులందరినీ రక్షించడానికి ప్రాథమిక నిబద్ధతతో కూడిన రూల్ ఆఫ్ లా దేశం అని ట్రూడో చెప్పారు. ఆర్.సీ.ఎం.పీ. పేర్కొన్నట్లుగా విచారణ కొనసాగుతోంది, అలాగే అరెస్టు చేసిన ముగ్గురు వ్యక్తుల ప్రమేయానికి మాత్రమే పరిమితం కాకుండా ఒక ప్రత్యేక, విభిన్నమైన దర్యాప్తు జరుగుతుందని ట్రూడో పేర్కొన్నట్లు కెనడియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ పేర్కొంది. సిక్కు వారసత్వం, సంస్కృతిని జరుపుకునే కార్యక్రమంలో ట్రూడో మాట్లాడుతూ… ప్రతి కెనడియన్‌కు కెనడాలో వివక్ష, హింస బెదిరింపులు లేకుండా సురక్షితంగా జీవించే ప్రాథమిక హక్కు ఉందని అన్నారు.
కెనడా ఒక రూల్ ఆఫ్ లా దేశం… -కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో-

