కాకినాడను దోపిడీదారుల నుండి కాపాడుకోవాలని దీనికి తమ మద్దతు ఉంటుందని అందువల్ల టీ.డీ.పీ., బీ.జే.పీ., జనసేన పార్టీలు బలపరిచిన అభ్యర్థులకే ఓటు వేయాలని దళిత, కాపు, కార్మిక, మత్స్యకార సంఘాలకు చెందిన పలువురు నేతలు పేర్కొన్నారు. కాకినాడను దోపిడి దారుల బారి నుండి రక్షించేందుకు అందరూ ఏకమై వారిని తరిమికొట్టాలంటూ పిలుపునిచ్చారు. శుక్రవారం కాకినాడలోని ఓ ప్రైవేటు హోటల్లో జనసేన పార్టీకి చెందిన వివిధ విభాగాలకు చెందిన నాయకులు విలేకరులతో సమావేశాన్ని నిర్వహించారు.
సమావేశ ఉద్దేశాన్ని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కాకినాడ పార్లమెంటు పార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ… కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వై.సీ.పీ. నేతలు మెగాస్టార్ చిరంజీవి, జనసేనాని పవన్ కుటుంబ సభ్యులపై ఎన్నో రకాలుగా కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలను తాము, పవన్ మరిచిపోలేదని గుర్తు చేసారు. ద్వారంపూడి అక్రమాలను ఎండగట్టి అతను ఓటమికి కృషి చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో పలు సంఘాలకు చెందిన జనసేన నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

