గ్రామ వాలంటీర్ల ఆధ్వర్యంలో కుల గణన చేపట్టడం వలన కాపులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆంధ్ర కాపు సద్భావన సంఘం రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి యేసుదాసు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ ఎన్.ఎఫ్.సి.ఎల్ రోడ్ కాపు కళ్యాణ మండపం లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో వై.సి.పి. ప్రభుత్వం కుల గణన చేస్తుంది ఇది ముమ్మాటికీ మోసపూరిత రీతిలో ప్రభుత్వం చేస్తుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక విధానంలో సంబంధిత అధికారులతో సమగ్రంగా సర్వే చేయించి అపుడు రాష్ట్ర ప్రభుత్వం కుల గణన చేయించాలని డిమాండ్ చేశారు.
ఏదైనా ఒక గ్రామం, ఒక డివిజన్ నీ తీసుకుని కుల గణన చేస్తారు. వై.సి.పి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఇప్పటివరకు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం నియమించుకున్న వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఒక అప్ రూపొందించి వెలి ముద్రలు సేకరిస్తు ఓ.టి.పి. ద్వారా సేకరించే కార్యక్రమం చేస్తున్నారని ఇది ముమ్మాటికీ ప్రజలను మోసం చేసే దోరణిలో జరుగుతుందని ఆరోపించారు.
