జమ్మూ-కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి శనివారం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఆర్మీ సిబ్బందికి గాయాలయ్యాయి. ఉత్తర కాశ్మీర్ జిల్లాలోని ట్రెహ్గామ్ సెక్టార్‌లోని కుమ్కాడి పోస్ట్‌కు సమీపంలో కొంతమంది దుండగులు ఎదురుకాల్పులు జరిపారని అధికారి ఒకరు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన ఎదురుకాల్పుల్లో గాయపడిన సిబ్బంది అక్కడ చిక్కుకున్నట్లు అధికారులు ధృవీకరించారు. ప్రస్తుతం కుప్వారాలోని మచ్చిల్ సెక్టార్‌లోని అటవీ ప్రాంతాల్లో ఎన్కౌంటర్ ఆపరేషన్ కొనసాగుతోంది.
కుప్వారా అడవుల్లో ఉగ్రవాదుల దాడి… ఆర్మీ జవాన్లకు గాయాలు…
