Political

కిసాన్ మోర్చా కార్మిక సంఘాల గ్రామీణ బంద్ విజయవంతం…

WhatsApp Image 2024-02-16 at 4.28.35 PM

బి.జె.పి. ప్రభుత్వం రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ రైతులు కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించ దేశవ్యాప్త గ్రామీణ బంద్ తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతం అయింది. నల్లజర్ల, నిడదవోలు, కొవ్వూరు, రాజమండ్రి రూరల్, పెరవలి గోపాలపురం, దేవరపల్లి, తదితర ప్రాంతాలలో వ్యవసాయ కార్మిక సంఘం, ఏ.పీ. రైతు సంఘం ఏ.ఐ.టీ.యూ.సీ., తదితర వామపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బ్యాంకులు, పోస్ట్ ఆఫీస్ లు బంద్ నిర్వహించి గ్రామీణ ప్రాంతాలలో ర్యాలీలు నిర్వహించారు.

ఈ సందర్బంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి సి.పి.ఐ. జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ… ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనకు తాము పూర్తి మద్దతును ప్రకటించేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. వివిధ ప్రాంతాల నుండి వేలాదిమంది తరలివచ్చిన రైతుల్ని తీవ్రవాదులుగా చూడటం మోడీ ప్రభుత్వానికి తగదని మండిపడ్డారు. రైతుల న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని, లేనిపక్షంలో రైతు కన్నేర చేస్తే మోడీ పతనం ఖాయమని మధు విమర్శించారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.