కాకినాడ జిల్లా సామర్లకోటలో కామ్రేడ్ వి.ఐ. లెనిన్ శత వర్ధంతి సందర్భంగా కార్మిక వర్గం పోరాట కర్తవ్యాలు అనే అంశంపై స్థానిక ఏ.ఐ.టి.యు.సి. కార్యాలయంలో భారత కమ్యూనిస్టు పార్టీ సి.పి.ఐ. సామర్లకోట శాఖ ఆధ్వర్యంలో సదస్సును నిర్వహించారు. దీనికి పట్టణ కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి పెదిరెడ్ల సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా సి.పి.ఐ. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు పాల్గొని సోషలిస్టు రాజ్య నిర్మాత, విప్లవ మహానాయకుడు వి.ఐ. లెనిన్ చిత్రపటానికి పూలదండలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ… ప్రపంచ మానవాళి విముక్తికి మహోన్నత సిద్ధాంతాన్ని మార్క్స్, ఏంగెల్స్‌లు అందిస్తే దానికి అప్పటి నిర్ధిష్ట పరిస్థితులలో తన ఆలోచనలను చేర్చి ఆచరణలో పెట్టి ప్రపంచంలోనే మొట్టమొదటి సామ్యవాద కలను సాకారం చేసిన మహానేత లెనిన్ అని మధు అన్నారు. ఆయన బతికింది యాభై నాలుగేండ్లే కావచ్చు కానీ ప్రజలందరికీ విముక్తి ఆయుధపు ధ్వని ఆయనే అన్నారు.
కామ్రేడ్ లెనిన్ కు ఘనంగా నివాళి… సామర్లకోట కమ్యూనిస్టు పార్టీ

