సావిత్రీబాయి పూలే 193వ జయంతి ఉత్సవాన్ని కాజులూరు మండలం గొల్లపాలెం జెడ్పీ హైస్కూలు గ్రౌండ్లో కాజులూరు మండల యూ.టీ.ఎఫ్. ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా యూ.టీ.ఎఫ్. సభ్యులు, ఉపాద్యాయులు పెద్ద ఎత్తున హాజరై తమ ఐక్యతను కనబరిచారు. ఈ జయంతి వేడుకలకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఐ.వీ. రావు, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి అన్నవరం, పూర్వపు కార్యదర్శి వర్మ, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి, తదితర ప్రముఖులు పాల్గొని ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్సీ ఐ.వీ. రావు మాట్లాడుతూ… సావిత్రీబాయిపూలే, జ్యోతీరావ్ ప్పూలేల ర్యాగాల్ని, సేవల్ని నేటి ప్రజలు ఆదర్శంగా తీసుకోవాలనీ సూచిం చారు. విద్యార్థులు, ఉపాద్యాయులచే నిర్వహించిన సాస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో జిల్లా యూ.టీ.ఎఫ్. అధ్యక్షుడు నగేష్, ఉపాద్యక్షురాలు బీ నాగమణి, ప్రధాన కార్యదర్శి చక్రవర్తి, తదితరులు పాల్గొన్నారు.
కాజులూరులో సావిత్రీబాయి పూలే జయంతి వేడుకలు…

