కాకినాడ నగరపాలక సంస్థలో 10,000 పైగా వీది కుక్కలున్నట్టు ఇంచార్జి కమిషనర్ నాగ నరసింహారావు తెలియజేశారు. వీటికి ఏఆర్వీ వేక్సిన్ వేసే ప్రక్రియను త్వరలో ప్రారంభించనున్నట్టు ఆయన వెల్లడించారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణపై మున్సిఫల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృద్వీచరణ్ తదితరులతో ఆయన సమీక్షించారు. వీధి శునకాలకు ఎఆర్వీలను వేసేందుకు నలుగురు సభ్యులతో కూడిన ఎనిమిది బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు.
కాకినాడ స్మార్ట్ సిటీలో 10,000కు పైగా వీధి శునకాలున్నాయి… -కమిషనర్ నాగ నరసింహారావు-

