కాకినాడ సిటీ జగన్నాథపురంలో వంగవీటి మోహన రంగా 35వ వర్థంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ లారీ యూనియన్ అధ్యక్షుడు దుగ్గన బాజ్జీ, వాసిరెడ్డి శివ ముఖ్య అతిథులుగా విచ్చేసి చిక్కాల వారి వీధిలో గల వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి పూలమాల్లు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… ఆయన బడుగు, బనహీన వర్గాలకు అండగా నిలబడి వారి కోసం చేసిన పోరాటాన్ని గుర్తుచేసారు. ఆయన ఆశయలతో నేటి యువత ముందుకు నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ లారీ యూనియన్ అధ్యక్షుడు దుగ్గన బాజ్జీ, వాసిరెడ్డి శివ, ఆకుల శ్రీనివాస్, రెడ్డి శ్రీనివాసరావు, వరదా దొరబాబు, కోరుకొండ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

