
శాస్త్ర సాంకేతికత ఎంతపెరిగినా … నాటు వైద్యం … భూత వైద్యం… భాణామతి… మూడనమ్మకాలు ఇంకా ఏలుబడి చేస్తూనే ఉన్నాయి. వైద్య ఆరోగ్య శాఖ కూడా ఇందులోంచి బయటపడలేకపోతోంది. కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కాలికి దెబ్బ తగలడంతో డిఎంహెచ్‌ఒ కార్యాలయానికి వాస్తుదోషం ఉందని తేల్చేశారు. కార్యాలయంలో మార్పులు చేర్పులు మొదలయ్యాయి. మొదటి అంతస్తులో ఉండే డిఎంహెచ్‌ఒ గ్రౌండ్‌ఫ్లోర్‌కి దిగిపోయారు. జిల్లా ఇమ్యునేజేషన్ అధికారి (డిఐఒ) గదిని డిఎంహెచ్‌ఒ ఛాంబర్‌గా మార్చేశారు.
వాస్తు దోషం పేరుతో ఈ కార్యాలయంలోని లిఫ్ట్‌ను మూసివేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే అనేకసార్లు వాస్తు పేరుతో గోడలు కూల్చివేసి, కొత్త నిర్మాణాలు జరిపారు. గేట్లు మూసివేశారు, మరలా తెరిచారు. డిఎంహెచ్‌ఒ కార్యాలయం చుట్టూ అనారోగ్యకర పరిస్థితులున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోడం చర్చానీయాంశంగా మారింది.

A P J Vinu
7 November 2023This is blind belief
Spy News
7 November 2023Thanks for your comment