కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో జిల్లాస్థాయి జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమాన్ని స్పందన సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టరు డా. కృతికాశుక్లా, జే.సీ. ఎస్. ఇలక్కియ, ఇన్చార్జి డీ.ఆర్.వో., డీ.ఆర్.డీ.ఏ. ప్రాజెక్ట్ డైరెక్టర్ కే. శ్రీరమణి, తదితరులతో కలిసి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్బంగా కృతికాశుక్లా మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలుచేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, రెవెన్యూ, పౌర సరఫరాల సేవలు, నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు పథకం కింద పట్టాల పంపిణీ, ఇళ్ల మంజూరు, పెన్షన్లు, సర్వే, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, భూ వివాదాలు తదితరాలకు సంబంధించి మొత్తం-273 అర్జీలు వచ్చాయన్నారు. ఈ అర్జీలను త్వరగా పరిష్కారించాలని ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేసారు.
కాకినాడ లో స్పందన కార్యక్రమంలో 273 అర్జీలు స్వీకరణ…

