Political

కాకినాడ రూరల్ 17 వార్డు నందు జనసేన ఇంటింటా ప్రచారం…

WhatsApp Image 2024-04-30 at 8.32.14 PM

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో కాకినాడ పార్లమెంటు స్థానానికి ఉమ్మడి పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ కు మద్దతుగా కాకినాడ రూరల్ నియోజకవర్గం తూరంగి గ్రామపంచాయతీ 17 వార్డు నందు కాకినాడ పార్లమెంటు ఎలక్షన్ కమిటీ సభ్యులు మల్లాడి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించడం నిర్వహించారు. ఈ సందర్బంగా పెద్ద ఎత్తున మహిళలు, యువకులు, గ్రామ పెద్దలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పాలకుల నిర్లక్ష్యాన్ని గురైన ప్రజలు అనేక సమస్యలను విన్నవించుకున్నారు.

వాటిలో ప్రధానంగా మంచినీటి సమస్య, డ్రైనేజీ సమస్య, వికలాంగుల వృద్ధుల పెన్షన్ల గురించి విన్నవించుకున్నట్లు మల్లాడి రాజేంద్ర తెలిపారు. నెల రోజుల్లో రాబోతున్నది ప్రజా ప్రభుత్వమని పవన్ కళ్యాణ్, చంద్రబాబు, మోడీ త్రిమూర్తుల కలయికలో సంక్షేమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం తధ్యమని అన్నారు. తప్పకుండా మీ సమస్యలు అన్నిటినీ ఎమ్మెల్యే, ఎం.పీ. అభ్యర్థుల దృష్టికి తీసుకువెళ్లి తప్పకుండా పరిష్కార మార్గాన్ని చూపిస్తానని మల్లాడి హామీ ఇచ్చారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.