Exclusive

కాకినాడ రూరల్ నుండి స్వతంత్రుడిగా పోటీ… -డాక్టర్ అన్నవరం-

WhatsApp Image 2024-03-06 at 4.05.09 PM

ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని రమ్య ఆసుపత్రి అధినేత డాక్టర్ పితాని అన్నవరం చెప్పారు. ప్రస్తుతం కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న కురసాల కన్నబాబుకు టికెట్ కేటాయిస్తే ఓడిపోతాడంటూ తన వద్ద కార్యకర్తలు చెప్తున్నారని వెల్లడించారు. గాంధీ నగర్లో ఉన్న తన రమ్య ఆసుపత్రిలో విలేకరులతో డాక్టర్ అన్నవరం సమావేశాన్ని నిర్వహించారు. తాను కాకినాడ రూరల్లో తన పితాని అన్నవరం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల మన్ననలు పొందుతున్ననన్నారు.

తాను జగన్ అభిమానినని అందువల్ల జగన్ అప్పగించిన బాధ్యతలను ఇబ్బంది పడకుండా నిర్వహించినట్లు చెప్పారు. అందులో భాగంగా గతంలో మండపేటలో జగన్ తనను పనిచేయమన్నారని ఆ తర్వాత కాకినాడ రూరల్ కు వెళ్ళమని జగన్ సూచించినట్లు పేర్కొన్నారు. ఇలా గడచిన ఐదేళ్ల కాలం నుంచి కాకినాడ రూరల్ అసెంబ్లీ పరిధిలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దగ్గరుండి చూసానని వాటిని అధిగమించి సుపరిపాలన అందించాలని అభిప్రాయం తన మనసులో కలిగిందన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.