మురుగుకాలువల స్లాబురాళ్ళు పూడిక తీత వలన మురుగు బెడద ముంపుతీవ్రత తొలగదని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. ముంపు నివారణకు యాక్షన్ ప్లాన్ చేపట్టాలన్నారు. శాఖల నడుమ సమన్వయం లేక ఉప్పుటేరు ముంపు తప్పడం లేదన్నారు. 2010-21 లో మురుగుతో బాటుగా గాలేరు, ఏలేరు, బిక్కవోలు, సాగు నీటి కెనాల్స్ లో ఎగువ నుండి వచ్చే గోదావరి వరద నీరు సముద్రంలోకి కలవడంలో ఎదురవుతున్న అవరోధాల వలన ముంపు సిటీగా మారిందన్నారు. ఇప్పటికైనా ఆర్ అండ్ బి రెవిన్యూ ఏలేరు మేజర్ సాగునీటి ఇరిగేషన్ పిడబ్ల్యూడి జలవనరుల శాఖ పోర్ట్ రైల్వే శాఖల సమన్వ యంతో సమీక్ష చేపట్టాలన్నారు.
కాకినాడ ముంపు నివారణకు చర్యలు చేపట్టాలి – పౌరసంక్షేమ సంఘం-

