కాకినాడ స్వయంభూ భోగి గణపతి పీఠంలో శోభకృత్ కార్తీక మాస మూడవ సోమవారం సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన మంచు శివలింగానికి శివ సహస్ర నామావళితో మంగళ హారతి అందించారు. స్వయంభువుకి కవచం తిరుమల శ్రీవారిపాదాల ప్రతిష్టాపన సందర్భంగా చేపట్టిన 8వారాల శివ కేశవ సమారాధనలో భాగంగా మూడవ సోమవారం108 మంది ముత్తయిదువులకు అన్నసమారాధన తాంబూలాల ప్రదానం నిర్వహించారు. మంచు శివలింగం భక్తులను విశేషంగా అలరించింది. తొలుతగా గణపతికి 809వ సామూహిక జపయజ్ఞ పారాయణతో మహా నైవేద్య నివేదన చేశారు. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ… కార్తీక ధనుర్మాసాల్లో శివకేశవ ఆరాధన చేయడం సర్వ శుభాలకు మంగళ కరమన్నారు. ధనుర్మాసంలో సముద్రునికి అఖండ హారతి జరుగుతుందని తెలిపారు.
కాకినాడ భోగిగణపతి పీఠంలో మంచుశివలింగానికి కార్తీకహారతి…