కాకినాడ జల్లా కాకినాడ సముద్ర తీరంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సముద్రం లోకి చేపలు వేటకు వెళ్లిన మత్స్యకారులు ఫైబర్ బోటు బోల్తాపడింది. ఆ ప్రమాదంలో ఇద్దరు మత్స్యకారులు గల్లంతు అయ్యారు. సూర్యరావు పేట నుండి హోప్ ఐలాండ్ వద్దకు ఐదుగురు మత్స్యకారులు వేటకు వెళ్ళారు. వేట ముగించుకుని తిరిగి వస్తుండగా కెరటాల దాటికి తెప్ప తిరగబడి ఇద్దరు గల్లంతయ్యారు. మిగిలిన ముగ్గురు సురక్షితంగా వొడ్డికి వచ్చారు. గల్లంతయిన వారిలో… దుమ్ముల పేటకు చెందిన మైలపిల్లి కృపదాసు,సూర్యరావు పేటకు చెందిన గరికిన సత్తిరాజుగా గుర్తించారు. గల్లంతయిన వారి కోసం గాలింపులు చేపట్టారు.
కాకినాడ తీరంలో తిరగబడ్డ ఫైబర్ బోటు

