కాకినాడ జిల్లాలో ఆయా ప్రదేశాల్లో పనిచేస్తున్న తొమ్మిది మంది ఎస్.ఐ. లను బదిలీ చేస్తున్నట్లు ఎస్.పీ. సతీష్ కుమార్ ఉత్తర్వులను జారీ చేశారు. వీఆర్లో ఉన్న ఎం.వీ.వీ. రవీంద్రబాబు కాకినాడ వన్ టౌన్ ఎస్సైగా నియమించినట్లు తెలిపారు. అక్కడ పని చేస్తున్న శోభన్ బాబును పెదపూడి బదిలీ చేశారు. పెదపూడిలో పని చేస్తున్న రామారావు కరప బదిలీ అయ్యారు. కరప ఎస్సైగా ఉన్న ఎన్.రా మకృష్ణను గండేపల్లిలో నియమించారు. అక్కడ పని చేస్తున్న వై.గణేష్ కుమార్ ను కాకినాడలో వీఆర్లో ఉంచారు. వీఆర్ ఉన్న ఎ. బాలాజీకి గొల్లప్రోలులో పోస్టింగ్ లభించింది. ఆ స్థానంలో పని చేస్తున్న వినయ్ ప్రతాప్ ను కాకినాడలో వీఆర్లో ఉంచారు. సర్పవరంలో పని చేస్తున్న వి.మౌనిక సామర్లకోటకు, ఎన్. సతీష్ బాబు పెద్దాపురానికి బదిలీపై వెళ్లనున్నారు.
కాకినాడ జిల్లాలో ఎస్.ఐ. లు బదిలీ… -బదిలీ అయిన ప్రదేశాలివే-

