ఆంద్ర రాష్ట్రంలో అంగన్వాడీలకు కనీసం 26 వేలు పెంచాలని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రాడ్యుటి అమలు చేయాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, తదితర డిమాండ్లపై చేస్తున్న నిరవధిక సమ్మె 30 రోజుకు చేరుకుంది. ఈ సందర్బంగా కాకినాడ నగరం కలక్టరేట్ వద్ద మొదలుపెట్టిన 24 గంటల రిలే దీక్షలు నాలుగో రోజుకి చేరుకున్నాయి. ఈ సమ్యె సభిరానికి ప్రత్తిపాడు, శంఖవరం అంగన్వాడీ ప్రాజెక్టుల నాయకులు అల్లాడి లక్ష్మీ, కాకరపల్లి సునీత, గెడ్డం బుల్లమ్మ విచ్చేశారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… సుప్రీంకోర్టు తీర్పుపై జగన్ మోహన్ రెడ్డి కి ఏటువంటీ గౌరవం లేదని, ఉంటే అంగన్వాడీలకు గ్రాడ్యుటి అమలు చేయాలని అన్నారు. మారుతున్న కాలఘమణానికి అనుగణంగా కనీస వేతనాలు చెల్లించమని అడిగితే తమ పై ఎస్మాని ప్రయోగించి తన బుద్ధిని బయట పెట్టుకున్నాడని విమర్శించారు. తమ డిమెండ్ లను నెరవేర్చేవరకు సమ్యె విరమించుకోమని హెచ్చరించారు.

