కాకినాడ లో సుమారు 114 కోట్ల రూపాయల వ్యయంతో కార్మికుల ఆరోగ్య భద్రతకై నిర్మించిన ఈ.ఎస్.ఐ. ఆసుపత్రిని ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ విధానం లో ప్రారంభిస్తున్నట్లు కాకినాడ ఎం.పీ. వంగా గీత వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… 2020లో ప్రారంభించిన ఆసుపత్రి 2024 నాటికి పూర్తి చేయడం ఆనందకరమన్నారు.
నిర్మాణ సమయంలో కరోన, భారీ వర్షాలు ఆటకం పరిచినా సకాలంలో పూర్తిచేసిన వైద్య విభాగ నిపుణులకు కృతజ్ఞతలు తెలిపారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ… కాకినాడ నుంచి ఈ.ఎస్.ఐ. ఆసుపత్రి తరలిపోతుండగా తామే కాకినాడలో ఏర్పాటు చేయాలని సీ.ఎం. జగన్ కు సూచించడంతో ఈ కార్మికుల కల సాకారమైందన్నారు.
కార్మికులకు అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు కల్పించనున్నామని ఆసుపత్రి సకల సౌకర్యాలతో నాలుగు ఆపరేషన్ థియేటర్లతో నిర్మించామన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ అదనపు కమిషనర్ సి.హెచ్. నాగ నరసింహారావు, ఎం.హెచ్.ఓ. పృధ్వి చరణ్, ఇన్చార్జి సూపరిండెంట్ కే. శ్రీనివాసరావు, ఎం.ఈ. పి. సత్యకుమారి, తదితరులు పాల్గొన్నారు.
