కాకినాడ జిల్లాలో కాకినాడ అర్బన్ జయప్రకాశ్ నగర్ లో ఉన్న 3వ వార్డు సచివాలయంలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అర్బన్ వై.సీ.పీ. అధ్యక్షులు మాజీ కౌంసిలర్ వడ్డీ మణికుమర్ ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… బ్రిటిష్, పోర్చుగీస్ పాలన నుండి భారతదేశం రాజకీయ స్వాతంత్ర్యం పొందడానికి సమాజంలోని విస్తృత వర్గాలకు చెందిన వ్యక్తుల, సంస్థల ప్రయత్నాలు చేశారన్నారు. కొందరు తమ ప్రాణాలను సైతం అర్పించారని, మరి కొంతమంది పలుమార్లు జైలుపాలయ్యారు అన్నారు. వారు చేసిన త్యాగాలను కొనియాడారు. తదనంతరం త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. ఈ కార్యక్రమానికి సచివాలయం సిబ్బంది, వాలింటీర్లు, ప్రభుత్వ పాఠశాల ఉపద్యాయులు, విద్యార్ధి,విద్యార్ధినిలు హాజరయ్యారు.
కాకినాడ అర్బన్ 3వ వార్డులో గణతంత్ర వేడుకలు…

