అయిదేళ్ల విలువైన కాలాన్ని ప్రజలంతా ఇస్తే ఏం చేయలేని జగన్.. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సర్వ నాశనం చేసిన జగన్ ఇప్పుడు మళ్లీ కొత్తగా ఏదో చేస్తానని చెబుతున్నాడని కాకినాడలో వారాహి విజయభేరీ సభలో జనసేన అధదినేత పవన్ కళ్యాన్ అన్నారు. ఎన్నికల వేళ ఓట్ల కోసం రకరకాల మాటలు తియ్యగా చెబుతున్నాడన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, అభివృద్ధిలో అట్టడగు స్థానానికి తీసుకెళ్లిన ఈ వై.సీ.పీ. నాయకుడికి ఇప్పటికే ఓటమి అర్ధమయిందని ఆయన అన్నారు. రాబోయే 24 గంటల్లో వై.సీ.పీ. చేసిన దుర్మార్గ పాలనను ఓటర్లు గుర్తు చేసుకోవాలని సూచించారు. ఎన్ని దాష్టీకాలకు తెగబడ్డాడో, అన్ని రంగాలను, వర్గాలను ఎంతలా ఇబ్బందిపెట్టాడో అన్ని ఆలోచించి 13వ తేదీ ఉదయం ఓటు వేయండని కోరారు.
కాకినాడలో వారాహి విజయభేరీ సభలో ప్రసంగించిన పవన్ కళ్యాణ్…

