కాకినాడలోని రామారావు పేటలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్యాలయాన్ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ప్రారంభించారు. ఈ కార్యాలయాన్ని ఆమె రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… కాకినాడ లాంటి నగరంలో పార్టీ అవసరాలకు కార్యాలయాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. దేశంలో మోడీ ప్రభుత్వం రావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. అనంతరం ఆమెకు పుష్పగుచ్ఛాలిచ్చి అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షుడు చిలుకూరి రామ్ కుమార్, కాకినాడ నగర బీజేపీ ఇంచార్జ్ గట్టి సత్యనారాయణ, బీజేపీ నాయకులు పైడా కృష్ణమోహన్, ముత్తా నవీన్, సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న, తదితరులు పాల్గొన్నారు.

