కాకినాడ నగరంలో తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ పరిమళ సువాసనలు వెదజల్లాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం నుండి కాకినాడ నగరానికి సుమారు 50 వేల లడ్డూలు ప్రత్యేక వాహనంలో కాకినాడ చేరాయి. దీంతో గుడారగుంట లక్ష్మి హాస్పిటల్ వెనుకున్న సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి గెస్ట్ హౌస్ ప్రాంగణం పవిత్ర ప్రదేశం లో ఈ లడ్డూలను దిగుమతి చేసుకున్నారు. దిగుమతి చేసుకున్న లడ్డూలను సుమారు రెండువందల మంది మహిళలు నిష్టగా ప్రత్యేక ప్యాకింగ్ చేసి వాటిలో పసుపు, కుంకుమ , అక్షతలు కలిపి ఒకే కవర్లో వేసి పంపిణీకి సిద్దం చేస్తున్నారు.
కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి దంపతులు ఆధ్వర్యంలో శుక్రవారం స్దానిక రంగరాయా మెడికల్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించే శ్రీ నివాస కళ్యాణం అంతరం ఈ తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ ను అందజేయాదానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ లడ్డూ ప్రసాడం ప్రత్యేక ప్యాకింగ్ భాద్యతలను కాకినాడ వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్ పర్సన్ పసుపులేటి వెంకటలక్ష్మి శేఖర్ దాంపతుల స్వీయ పర్యవేక్షణలో అత్యంత భక్తి శ్రద్ధలతో సాగుతున్నాయి.

