విద్యార్థులు తమజ్ఙాన సంపదను పెంచుకోవాలంటే, అందరితోనూ పంచంకోవాలని ముఖ్య వక్త ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు జె.ఎన్.టి.యు.కె. ప్రొఫెసర్ మురళీకృష్ణ కోరారు. జెవివి సైన్స్ అవార్డ్స్ కార్యక్రమాన్ని కాకినాడలో జె.ఎన్.టి.యు.కె. నందు ఘనంగా ఏర్పాడుచేసారు. ఈ కార్యక్రమం జిల్లా జె.వి.వి. అధ్యక్షులు కె.ఎమ్.ఎమ్.ఆర్.ప్రసాద్ అధ్యక్ష వహించారు. ఈ సందర్బంగా మురళీకృష్ణ మాట్లాడుతూ… మొట్టమొదటి శాస్త్రవేత్త పిల్లవాడు అని , బాల్యం నుండి పిల్లలలో ఉదయించే ఎన్నో ప్రశ్నలే వారిని శాస్త్రవేత్తలు గా మారుస్తాయన్న అబుల్ కలాం వ్యాఖ్యలను గుర్తు చేసారు.
ప్రతి ఉపన్యాసంలో ఎన్నో విలువైన అంశాలు ఉంటాయని, వాటిని తప్పక పుస్తకంలో వ్రాయాలని, అలా వ్రాసిన వారే ఉన్నతులుగా ఎదుగుతారని ఎదుగుతారనో ఉద్బోధించారు. కాకినాడ సీపోర్ట్ సి.ఓ.ఓ. మురళీధర్ శాస్త్రీయ దృక్పథం పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ప్రముఖ మానసిక వైద్యులు వరప్రసాద్ మాట్లాడుతూ… తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలు ప్రవర్తనను ప్రతి సందర్భంలోను గమనించాలని వారి మనోభావాలను అర్థం చేసుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమానికి కాకినాడ అర్బన్ ఎమ్ఈ.ఓ. రవి, జయరామ్, లక్ష్మణ్, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సైన్స్ అభిమానులు పాల్గొన్నారు .

