కాకినాడ నగరంలో భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతిని వేడుకను కాకినాడ జర్నలిస్టులు అందరూ కలిసి ఘనంగా జరుపుకున్నారు. కాకినాడ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలత అంబేత్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. అనంతరం కేకును కత్తిరించి జర్నలిస్టులకు ఒకరికి ఒకరు తినిపించుకుని ఆప్యాయత చాటుకున్నారు.
ఈ సందర్భంగా అంబేద్కర్ జోహార్.. జోహార్.. జోహార్.. అంటూ నినాదాలు చేశారు. ఈ సమావేశంలో పలువురు సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతూ… బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి అంబేద్కర్ ఆశయ సాధన కోసం అందరూ పని చేయాలని పిలుపునిచ్చారు. ఆయన వేసిన బాటలు అందరికీ ఆదర్శంగా నిలుస్తాయని ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు.

