Kakinada

కాకినాడలో ఎన్.టి.ఆర్. నగర్ నిర్మించాలి… -పౌరసంక్షేమ సంఘం-

NTR

తెదేపా ప్రభుత్వం ఏర్పడిన 1983లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు తొలుతగా కాకినాడ పట్టణ పర్యటనలో కాకినాడ ఎమ్మెల్యే పౌర సరఫరాల శాఖమంత్రి ముత్తా గోపాలకృష్ణ హయాంలో దుమ్ముల పేటకు స్వయంగా వెళ్లారని పౌరసంక్షేమ సంఘం తెలిపింది. మత్స్యకార పూర్వీకుల కు కేటాయించిన భూమి లో ఎన్.టి.ఆర్. నగర్ నిర్మించాలని పౌర సంక్షేమ సంఘం కన్వీ నర్ సామాజిక వేత్త దూసర్లపూడి రమణ రాజు కోరారు.

అప్పట్లో ఆ భూమి పన్నెండు అడుగుల లోతు కారణంగా మరో చోట ఇండ్లు నిర్మించి ఇస్తామని ఎన్.టి.ఆర్. పేర్కొన్నప్పటికీ తమ పూర్వీకుల ప్రదేశమైన ఆ స్థలంలోనే భూమి ఎత్తు చేసుకుని ఇండ్లు నిర్మించుకుంటామని మత్స్యకారులు తెలిపారు. వారి కోరిక మేరకు ముత్తా గోపాలకృష్ణ ఆదేశాలతో అప్పటి మున్సిపల్ చైర్మన్ జ్యోతులసీతారామమూర్తి కౌన్సిల్ ద్వారా అనేక సంవత్స రాలపాటు డంపింగ్ డెబ్రిస్ వేయించినప్పటికీ పునాదుల్లోనే పనులు ఆగిపోయాయన్నారు.

దీర్ఘకాలికంగా ఇండ్ల నిర్మాణం జరగక పోవడం వలన వివిధ ప్రభుత్వాల హయాంలో స్థలాన్ని స్వాధీనం చేసు కునే ప్రక్రియ జరిగినప్ప టికీ ప్రజలకు అండగా పౌరసంఘాలు ప్రతిఘ టించడం జరిగిందన్నా రు. ఎన్ డి ఎ కూటమి ప్రభుత్వం ఏర్పడినందు న ఎన్.టి.ఆర్. జ్ఞాపకం గా దుమ్ములపేట భూమి లో ఎన్.టి.ఆర్. నగర్ నిర్మించాలని పౌర సంక్షేమ సంఘం కోరింది.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-10-20 at 4.43.33 PM
Kakinada

బాల్యవివాహాలను సమూలంగా నిర్మూలిద్దాం… నగరపాలక సంస్థ కమిషనర్ నాగ నరసింహారావు వెల్లడి…

బాల్య వివాహాల నిషేధిత చట్టం – 2006 ను మరింత పటిష్టవంతంగా అమలు చేయడంలో ఆయా ప్రభుత్వ శాఖలు సమన్వయంతో కృషి చేయాలని కాకినాడ నగరపాలక సంస్థ