విజయవాడలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 125 అడుగుల భారీ విగ్రహాన్ని ఈ నెల 19వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జీవిత విశేషాలు, ముఖ్యమైన ఘట్టాలపై ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేశారు.
ఈ ప్రధర్శనకు జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియా ముఖ్య అతిథులుగా విచ్చేసి ఫొటో ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్బంగా డిప్యూటీ డైరెక్టర్ డి. నాగార్జున మాట్లాడుతూ… ప్రజలందరూ ఈ ప్రదర్శనకు వచ్చేసి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జీవిత విశేషాలను తెలుసుకోవాలని కోరారు.

