పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామానికి చెందిన మహిళకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే… అనారోగ్యంగా ఉన్న బంధువులను చూసేందుకు కాండ్రకోట గ్రామానికి చెందిన మహిళ కాకినాడ వెళ్లింది. వారం రోజులుగా కాకినాడలోనే బంధువుల ఇంటిలోనే నివాసముంది. కాని రెండ్రోజుల నుంచి ఆ మహిళకు ఆయాసం ఎక్కువగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు చికిత్స చేసి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారించారు. కోవిడ్ పాజిటివ్ రావడంతో ఆమెను కాకినాడ జీ.జీ.హెచ్. లోని ప్రత్యేక వార్డులో ఉంచి చికత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.
కాండ్రకోటలో మహిళకు కోవిడ్ పాజిటివ్…
