Viral

కాంట్రాక్ట్ కార్మికుల సంక్షేమం కోసం కృషి చేద్దాం… -రంబాల సతీష్-

WhatsApp Image 2024-01-24 at 5.32.52 PM

ప్యారి షుగర్స్ కాంట్రాక్ట్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సమావేశం కాకినాడ మసీద్ సెంటర్ వద్ద యూనియన్ ఆఫీసులో సూరిబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్మిక నేత రంబాల సతీష్ మాట్లాడుతూ… ప్యారి షుగర్స్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సంక్షేమం కోసం అసోసియేషన్ ఏర్పాటు చేశామని వారి సంక్షేమం కోసం కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ కార్మికులు సభ్యత్వం నమోదు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

కాంట్రాక్ట్ కార్మికులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. పని ప్రదేశాల్లో అప్రమత్తంగా ఉండాలని భద్రతపై అవగాహన కలిగి ఉండాలని తెలియజేశారు. ఈ సమావేశంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు కే. కనకారావు, సహాయ కార్యదర్శి ఏ. ఏసుబాబు, కార్యదర్శి అత్తిలి బాల సూర్యనారాయణ, కోశాధికారి ఆది బాబు, తదితరులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.