Telangana

కాంగ్రెస్‌లో చేరిన హైదరాబాద్‌ డిప్యూటీ మేయర్‌…!!!

OIF (2)

తెలంగాణ రాష్ట్రంలో బీ.ఆర్‌.ఎస్‌. పార్టీకు రాజీనామా చేసిన మరుసటి రోజు గాంధీభవన్‌లో ఏ.ఐ.సీ.సీ. ప్రధాన కార్యదర్శి, పార్టీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ దీపా దాస్‌ మున్షీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి అధికార కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… 24 ఏళ్లుగా గులాబీ పార్టీకి సేవలందించిన శ్రీలత, ఆమె భర్త వంటి వారిని పక్కనపెట్టి కొత్తగా చేరిన వారికి బీ.ఆర్‌.ఎస్‌. కీలక పదవులు ఇచ్చిందని అన్నారు.

బీ.ఆర్‌.ఎస్. అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమకారులను విస్మరించిందని, నాయకత్వ అవమానాలు భరించలేక గులాబీ పార్టీ నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్దంగా కడుతున్నారని అన్నారు. కాంగ్రెస్‌లో ప్రతి నాయకుడికి గౌరవప్రదమైన స్థానం ఉందని ఆయన అన్నారు. అదే సమయంలో కాంగ్రెస్‌లో చేరడం తన తల్లి ఇంటికి తిరిగి వచ్చినట్లే అని శ్రీలత అన్నారు. బీ.ఆర్‌.ఎస్‌. లో తన రెండు దశాబ్దాల సుదీర్ఘ సేవలను గుర్తుచేసుకున్న ఆమె, బీ.ఆర్‌.ఎస్‌. లో తెలంగాణవాదులకు గౌరవం లేదన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

congress-leader-revanth-reddy-addresses-a-press-755234
Telangana

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయబోతున్నా… -రేవంత్ రెడ్డి –

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ లో కాంగ్రెస్ విజయం సాదిస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక సమావేశంలో తెలిపారు. నాయకులు, కార్యకర్తలు సంబరాలు
OIP (6)
Telangana

పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాలలో కాంగ్రెస్‌ ముందంజ…

పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాలలో కాంగ్రెస్‌ ముందంజలో కొనసాగుతోంది. ఉద్యోగుల్లో కూడా అధికార పార్టీ బీ.ఆర్‌.ఎస్‌. పై వ్యతిరేకత కనిపిస్తుంది. ఉమ్మడి ఖమ్మం పది స్థానాల్లోనూ కాంగ్రెస్‌ ముందంజలో