కర్నూల్ జిల్లో లో ఘోర విషాదం చోటుచేసుకుంది. స్థానిక మంత్రాలయానికి చెందిన టీస్టాల్ నిర్వాహకుడు ఆంజనేయులు, జయమ్మ దంపతుల పెద్ద కుమార్తె మేకల నందిని కర్నూలులో బీ.టెక్. మొదటి సంవత్సరం చదువుతోంది. అయితే ఉగాది ఉండటంతో రెండు రోజుల ముందే స్వగ్రామానికి వచ్చారు. కాగా.. మంత్రాలయం మండలం రచ్చుమర్రికి చెందిన చిన్నగోవిందు కుమారుడు చిన్నవెంకటేశులు ఇంటర్మీడియట్ వరకు చదువుకుని పొలం పనులు చేసుకుంటున్నారు.
చిన్నవెంకటేశు, నందినిలు ఒకే పాఠశాలలో చదువుకున్నారు. ఈ క్రమంలోనే ఒకరినొకరు ప్రేమించుకున్నారు. నందిని ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఇంట్లో కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు ఎంత వెతికినా ఫలితం లేకపోయింది. చివరకు మంత్రాలయం-మటుమర్రి రైల్వేస్టేషన్‌ల మధ్య ఉన్న టీ.బీ. వంతెన వద్ద శవమయ్యి కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మృతులను ఆసుపత్రికి తరలించారు. వీరి ఆత్మహత్యకి గల కారణాలు తెలియాల్సి ఉంది.

