ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కర్నూలు జిల్లా ఎస్పీ జి. కృష్ణ కాంత్ ఐ.పీ.ఎస్. ఆదేశాల మేరకు వాహానాల తనిఖీలు చేపట్టారు. క్రిష్ణగిరి మండలం, అమకతాడు గ్రామ శివారులోని జాతీయ రహదారి 44 పై ఉన్న టోల్ ప్లాజా వద్ద కర్నూల్ స్పెషల్ బ్రాంచ్ పోలీసు అధికారుల సమాచారంతో హైదరాబాదు నుండి కోయంబత్తూరు వెళుతున్న NL 01 M 2506 సురేష్ స్వామి అయ్యప్ప ప్రైవేట్ స్లీపర్, ఏ.సి. ట్రావెల్స్ బస్సు నందు నలుగురు నుండి బంగారం, వెండి తో పాటు భారీగా నగదు ను వెల్దుర్తి సర్కిల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అందులో అమర్ ప్రతాప్ పవర్ అనే వ్యక్తి నుంచి 1 కోటి 20 లక్షల 80 వేల నగదును, వెంకటేష్ రాహుల్ అనే వ్యక్తి నుంచి 3 కేజీల195 గ్రాముల బంగారు & రూ. 19 లక్షల 23 వేల 5 వందల నగదును, సెంథిల్ కుమార్ అనే వ్యక్తి నుంచి 4 లక్షల 50 వేల నగదును మరియు 1 కేజీ 37 గ్రాముల బంగారాన్ని మరియు శబరి రాజన్ అనే వ్యక్తి నుంచి 5 కేజీల వెండి బిస్కెట్లు పట్టుకొని సీస్ చేసినట్లు తెలిపారు. వాటి విలువ మొత్తం రూ. 4 కోట్ల 59 లక్షల 8 వేలుగా ఉంటుందని వెళ్లడించారు.

