రూ.1.35 కోట్ల వ్యయంతో కాకినాడ జిల్లాలో జగన్నాథపురం 22వ డివిజన కోరట్ల వారివీధిలో నిర్మించిన యాదవ కమ్యూనిటీ హాలు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సువిశాల ప్రాంగణంలో గ్రౌండ్, ఫస్ట్‌ప్లోర్ లతో అధునాతన సౌకర్యాలు, విశాల ప్రాంగణంలో ఈ కమ్యూనిటీహాలు నిర్మించామన్నారు.
ఇప్పటికే సూర్యనారాయణపురం, గొల్లపేట లలో ఉన్న రెండు కమ్యూనిటీహాల్స్ తోపాటు దీనిని అదనంగా నిర్మించడం జరిగిందన్నారు. వై.సీ.పీ. పార్టీ యాదవ కులస్తులకు అన్ని విధాల అండగా ఉంటామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కౌడ ఛైర్‌పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, వై.ఎస్.ఆర్.సీ.పీ. నగరాధ్యక్షురాలు, మాజీ మేయర్ సుంకర శివప్రసన్న, నగరపాలక సంస్థ ఎస్.ఈ. పి. సత్య కుమారి, స్మార్ట్ సిటీ ఎస్.ఈ. వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు.

