కాకినాడ వివేకానంద పార్కులో ఓటు హక్కు వినియోగిద్దాం ప్రగతిని సాధిద్దాం నినాదాలతో పౌర శంఖారావం నిర్వహించారు. ఈ సందర్భంగా పౌర కన్వీనర్ సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ… సోమవారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పొలింగ్ జరుగుతుందని తెలిపారు. సాయంత్రం 6 లోపు పొలింగ్ కేంద్రానికి వచ్చిన వారికి ఎన్ని గంటలైనా పొలింగ్ లో పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు. వేసవి ఎండల కారణంగా వెలువగా వచ్చి ఓటు హక్కు వినియోగం చేయాలని తెలిపారు. పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఒకరికి ఓటు వేయాలని ఎవరూ నచ్చకుంటే ఇ.వి.ఎం. మెషిన్ లో చివరి బటన్ గా వుండే నోటా కు ఓటు వేయవచ్చన్నారు. పోలింగ్ శాతం పెంచాలని విజ్ఞప్తి చేశారు.
ఓటుహక్కు వినియోగంపై పౌరశంఖారావం…

