రాష్ట్రంలో రాబోయే ఎన్నికల దృష్య జనాల్లో ఓటు హక్కు వినియోగంపై అవగాహన పెంచేందుకు మహిళలకు రంగవల్లుల పోటీలు నిర్వహిస్తున్నట్లు కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సి.హెచ్. నాగ నరసింహారావు చెప్పారు. ఆయన నగరపాలక సంస్థ అధికారులతో కలిసి పోటీలకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ… స్థానిక ఆనందభారతి గ్రౌండ్స్ లో
ఈ నెల 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ పోటీల్లో గెలిచిన విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు మూడు కన్సోలేషన్ బహుమతులు కూడా అందించనున్నట్లు వెల్లడించారు. ఓటు నమోదు చేసుకోవడం నుంచి ఓటు హక్కు వినియోగం వరకు ప్రజల్లో అవగాహన కల్పించేలా వేసే ఉత్తమ రంగవల్లులను న్యాయ నిర్ణేతలు బహుమతులకు ఎంపిక చేస్తారన్నారు.

