ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ – 2024లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలను కాకినాడ సిటీ నియోజకవర్గ ఈఆర్వో, కమిషనర్ సీ.హెచ్. నాగనరసింహారావు సందర్శించారు. అక్కడ ఉన్న బి.ఎల్.వో.లు, ఇతర సిబ్బందికి సూచనలు ఇచ్చారు. ఫారం–6,7,8 ద్వారా వచ్చే ప్రతీ ఒక్క దరఖాస్తును నిర్ధారణ చేసుకుని ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేయాలని ఆదేశించారు. ఓటర్లు తుది జాబితా ప్రచురణ తేదీ దగ్గర పడుతున్నందున పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై దృష్టిసారించాలని సూచించారు. ప్రత్యేక శిబిరాలను సందర్శించిన సందర్భంగా కొత్త ఓట్ల నమోదు కోసం వచ్చిన యువతతో మాట్లాడారు. ఈఆర్వో నాగనరసింహారావు భానుగుడి రిజర్వు పోలీస్ లైన్ ఆవరణలోని మున్సిపల్ ఉన్నతపాఠశాల, ఎల్విన్పేటలోని అంబేద్కర్ కమ్యూనిటీహాలు, రామారావుపేటలోని నగరపాలక సంస్థ టౌన్‌ప్లానింగ్ ప్రజారోగ్య విభాగాల్లోని పోలింగ్‌స్టేషన్, రామారావుపేటలోని మున్సిపల్ ఉన్నతపాఠశాల, తదితర పోలింగ్ స్టేషన్లను ఈఆర్వో నాగనరసింహారావు సందర్శించారు
ఓటరు నమోదు శిబిరాలను సందర్శించిన ఈ.ఆర్.వో. …

