Political

ఓటరు ఓటింగ్ డేటాను విడుదల చేయాలి… -ఎలక్షన్ కమీషన్-

election-commission-india

ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ప్రతి పోలింగ్‌ స్టేషన్‌కు సంబంధించిన ఓటర్‌ ఓటింగ్‌ డేటాను తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలంటూ ఎన్‌.జీ.వో. చేసిన పిటిషన్‌ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది.

ఇప్పటికే ఐదు దశల పోలింగ్ పూర్తయిందని, రెండు మాత్రమే మిగిలి ఉన్నందున ఈ దశలో అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేయడం ఎన్నికల కమిషన్‌కు సవాలుగా మారుతుందని జస్టిస్ దీపాంకర్ దత్తా, సతీష్ చంద్ర శర్మలతో కూడిన వెకేషన్ బెంచ్ పేర్కొంది.

గ్రౌండ్ రియాలిటీలను కూడా గుర్తుంచుకోవాలి, ఎన్నికల సమయంలో ప్రక్రియను మధ్యలో మార్చడం ద్వారా ఈ.సీ. పై అధిక భారం వేయకూడదని పేర్కొంది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ను ఎన్నికల తర్వాత రెగ్యులర్ బెంచ్ విచారించాలని కోర్టు వాయిదా వేసింది.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.