కాకినాడ ప్రభుత్వ సర్వజన సామాన్య ఆసుపత్రి లో అరుదైన వైద్య సేవలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతుంది. ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ ఎస్ లావణ్య కుమారి చొరవ, సహకారంతో ఇక్కడ వైద్యులు అద్భుతాలను ఆవిష్కరిస్తున్నారు. పేరుకి ధర్మాస్పత్రి అయినప్పటికీ వైద్య సేవలో మాత్రం కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా వైద్య సేవలు అందించి రోగుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారు.
ఇదే కోవలో మాతాశిశు ఆసుపత్రిలోని చిన్నపిల్లల విభాగంలో అరుదైన నెలలు నిండని నవజాత శిశువు వులకు సుమారు డబ్బై రెండు రోజుల పాటు విశేషమైన వైద్య సేవలు అందించి నేడు తల్లు లకు బిడ్డలను అప్పగించారు.ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన తల్లులు ఇద్దరూ, అలాగే అలాగే ఒకే కాన్పులో ఇద్దరు కవలలు లకు జన్మనిచ్చిన తల్లులకు జిజిహెచ్ పీడియాట్రిక్ విభాగం అధిపతి డాక్టర్ మాణిక్యాంబ చేతుల మీదుగా ఈ నవజాత శిశువులను అప్పగించారు.

