ఐక్యతే శెట్టిబలిజ కులస్తుల బలమని రాష్ట్ర సమాచార పౌరసంబంధ, బీసీ సంక్షేమ, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. స్థానిక రెవెన్యూ కాలనీ మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద శెట్టిబలిజ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం ప్రభుత్వం మంజూరు చేసిన 630 చ||గ|| స్థలం అప్పగింత ప్రక్రియ గురువారం జరిగింది.
మంత్రి చెల్లుబోయిన వేణు, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వేణు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి శెట్టిబలిజ సామాజిక వర్గానికి పెద్దపీట వేశారన్నారు. మంత్రులుగా, ఎంపీ ఎమ్మెల్యేలుగా చట్టసభల్లో మరే రాజకీయ పార్టీ కల్పించనంత ప్రాధాన్యతను శెట్టిబలిజ కులస్తులకు ఇచ్చారన్నారు.

