రుతుపవనాలు చురుగ్గా ఉండడంతో సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని డిజాస్టర్ మేనేజ్మెంట్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. సోమవారం ఎ.ఎస్.ఆర్. జిల్లాలో అక్కడక్కడ ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అనమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంగళవారం ఏ.ఎస్.ఆర్, శ్రీ సత్యసాయి, వై.ఎస్.ఆర్., తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఏ.పీ. లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం…

