రూ. 70 వేలు లంచం తీసుకుంటూ ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ ప్రసాద్ ఏ.సీ.బీ. కు పట్టుబడ్డాడు. అడిషనల్ ఎస్పీ వివరాలు ప్రకారం… దుళ్ళ గ్రామానికి చెందిన ముల్లపూడి శ్రీనివాసరావు తన మామయ్య ముత్యాల గోపాలకృష్ణకు గ్రామంలో వ్యవసాయ భూమికి పంట పొలంలో బోర్ వేయడానికి విద్యుత్ అధికారులను ఆశ్రయించారు. ఎస్టిమేషన్, దరఖాస్తు ప్రాసెస్ చేయడానికి సబ్ ఇంజనీర్ 70000 రూపాయలు లంచం అడగడం జరిగింది.
నెలలు గడుస్తున్న ఎస్టిమేషన్ స్లిప్ ఇవ్వకపోవడంతో ఈ విషయాన్ని రాజమండ్రి ఏ.సీ.బీ. అధికారులకు శ్రీనివాస్ ఫిర్యాదు చేయడం జరిగింది. అడిషనల్ ఎస్పీ సౌజన్య పథకం ప్రకారం శ్రీనివాసరావు 70000 రూపాయల నగదు సబ్ ఇంజనీర్కు అందజేస్తుండగా అధికారులు పట్టుకోవడం జరగింది.

