అంగన్వాడి వర్కర్లు చేపట్టిన సమ్మె రోజురోజుకి ఉదృతమవుతోంది. ఈ ససదర్భంగా జిల్లా అంగన్వాడి వర్కర్ల, హెల్పార్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు దడాల పద్మా వతి మాట్లాడుతూ… అంగన్వాడి వర్కర్లు న్యాయమైన డిమాండ్లపై సమ్మె చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు వీరి సమ్మెను విచ్ఛిన్నం చేయడం కోసం ఈ రోజే విధులకు జాయిన్ కాకపోతే ఉద్యోగాల నుంచి తొలగింపులు చేస్తామని ఐసిడిఎస్ అధికారుల నుంచి మెసేజ్లు, ఫోన్ కాల్స్ అంగన్వాడీ వర్కర్లకు, హెల్పర్లకు చేస్తున్నారని అన్నారు. ఈ మెసేజ్ లకు ఫోన్ కాల్స్ కు అంగన్వాడీలు భయపడరని సమస్యలు పరిష్కారం చేస్తేనే సమ్మె విరమిస్తారని చట్ట ప్రకారమే సమ్మె నోటిస్ ఇచ్చి సమ్మె చేస్తున్నామన్నారు.
ఎస్మా ప్రయోగించినా …తగ్గేదేలే…

