Kakinada

ఎలక్ట్రోరల్ పార్టిసిపేషన్ ప్రోగ్రాంలో భాగంగా కాకినాడలో బైక్ ర్యాలీ…

WhatsApp Image 2023-12-18 at 4.18.16 PM

కాకినాడలో జరగబోయే సిస్టమేటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రోరల్ పార్టిసిపేషన్ ప్రోగ్రాం (S.V.E.E.P.) లో భాగంగా ఈనెల 20వ తేదీన బైక్ ర్యాలీను నిర్వహిస్తున్నట్లు ఆ నగరపాలక సంస్థ కమిషనర్ సి.హెచ్. నాగ నరసింహారావు తెలిపారు. బైక్ ర్యాలీ ఉదయం తొమ్మిది గంటలకు కాకినాడ వివేకానంద పార్కు నుంచి ఇంద్రపాలెం అంబేద్కర్ విగ్రహం, తదితర ప్రాంతాలలో ర్యాలీ నిర్వహించి భానుగుడి మీదుగా మిలటరీ రోడ్డులోని శారదా దేవి ఆలయం వద్దనున్న నగరపాలక సంస్థ కార్యాలయానికి చేరుకుంటారని అన్నారు. సచివాలయ కార్యదర్శులు, బి.ఎల్.వో. లతో కలిసి ఈ బైక్ ర్యాలీ నిర్వహిస్తామని అన్నారు. సంబంధిత ఉద్యోగులంతా ఈ ర్యాలీలో పాల్గొని ప్రజల్లో ఓటు హక్కు పై అవగాహన కల్పించాలని కమిషనర్ కోరారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-10-20 at 4.43.33 PM
Kakinada

బాల్యవివాహాలను సమూలంగా నిర్మూలిద్దాం… నగరపాలక సంస్థ కమిషనర్ నాగ నరసింహారావు వెల్లడి…

బాల్య వివాహాల నిషేధిత చట్టం – 2006 ను మరింత పటిష్టవంతంగా అమలు చేయడంలో ఆయా ప్రభుత్వ శాఖలు సమన్వయంతో కృషి చేయాలని కాకినాడ నగరపాలక సంస్థ