కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం, అందలి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికలు పారదర్శకంగానూ, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కసరత్తులు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్ల తెలిపారు. గురువారం రోడ్లు భవనాల శాఖ రెవెన్యూ అధికారుల సమన్వయంతో రూపొందించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ లను భద్రపరిచే ఇనుప గెడంచీలను ఆమె పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గంలోని పార్లమెంటరీ ఏడు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి జరిగే పోలింగ్ ప్రక్రియ లో జిల్లాలో ఉన్న అన్ని ఈ.వీ.ఎం. యంత్రాలను స్థానిక జేఎన్టీయూ స్ట్రాంగ్ రూంలో భద్రపరచడం జరుగుతుందన్నారు. ఇందుకు సంబంధించి సివిల్ వర్క్స్ నిర్వహిస్తున్నట్లు కూడా ఆమె తెలిపారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిపించేందుకు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు యంత్రాంగాన్ని సంసిద్ధం చేస్తున్నామన్నారు.

