Political

ఎన్నికల సంఘం విధులను బాధ్యతతో నిర్వహించాలి…

WhatsApp Image 2024-02-13 at 3.11.34 PM

ఎన్నికల సంఘం విధులను బాధ్యతతో నిర్వహించాలని, ఇతర జిల్లాల నుంచి బదిలీపై వచ్చిన అధికారులందరూ గతంలో ఎన్నోసార్లు ఎన్నికల విధులు నిర్వహించినప్పటికీ ఎంత మాత్రం నిర్లక్ష్యం వహించరాదని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షు శుక్లా స్పష్టం చేశారు. మంగళవారం అమలాపురంలో కలెక్టరేట్ సమావేశపు హాలు నందు 2024 సాధారణ ఎన్నికలు నియమావళిలో బాగంగా ఎన్నికల వ్యయం, ఎక్సైజ్, జీఎస్టీ, ఎం.సి.సి, ఎం.సి.ఎం.సి., తదితర 18 అంశాలకు సంబంధించి నియమించిన నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… లోక్ సభ, శాసనసభ సాధారణ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన అంశాలపై ఆయా నోడల్ అధికారులు పూర్తి అవగాహన కలిగివుండాలన్నారు. ఎన్నికల విధులు ఎంతో కీలకమైనవని, ఎక్కడా ఏ చిన్న పొరపాటు జరగకుండా అన్ని జాగ్రత్తలతో సమర్థవంతంగా నిర్వ ర్తించాలన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.