రాష్ట్రంలో అమలు చేస్తున్న క్రమబద్దమైన ఓటర్ల విద్య, ఎన్నికల భాగస్వామ్య కార్యక్రమాలను ఎస్.వి.ఈ.ఈ.పీ. సమీక్షించేందుకు భారత ఎన్నికల సంఘం స్వీప్ అధికారుల బృంధం సి.ఇ.ఓ. ముఖేష్ కుమార్ మీనాను వారి చాంబరులో కలిసారు. త్వరలో రాష్ట్రంలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో 83 శాతం పైగా పోలింగ్ నమోదు లక్ష్యంగా ఓటర్ల విద్య, ఎన్నికల భాగస్వామ్య కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా తెలిపారు.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… రాష్ట్రంలోని ప్రతి పౌరునికి, ఓటర్లకి ఎన్నికల ప్రక్రియపై సమగ్ర అవగాహన కలిగించి, రానున్న ఎన్నికల్లో వారిని పెద్ద ఎత్తున బాగస్వామ్యులను చేసేందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో స్వీప్ కార్యక్రమాలను ప్రణాళికా బద్దంగా అమలు చేయడం జరుగుతుందన్నారు. 2019 లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా సగటున 79.77% పోలింగ్ నమోదు అవ్వగా, జాతీయ స్థాయిలో 69% పోలింగ్ నమోదు అయినట్లు తెలిపారు.
అయితే రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో 83% పైగా పోలింగ్ నమోదు అయ్యే లక్ష్యంతో స్వీప్ కార్యక్రమాలను విస్తృత స్థాయిలో అమలుపర్చడం జరుగుచున్నదన్నారు. ఇప్పటికే అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను మరియు స్వీప్ నోడల్ అధికారులను అప్రమత్తం చేయడం అయ్యిందన్నారు. జిల్లాల వారీగా స్వీప్ కార్యక్రమాల నిర్వహణపై తరచుగా సమీక్షలను నిర్వహించడం జరుగుచున్నదని ఆమె తెలిపారు.

