జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల కమీషన్ నిర్థేశించిన అన్ని సదుపాయాలను సమగ్రంగా కల్పించామని జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా తెలిపారు. స్థానిక కలెక్టరేట్ కోర్ట్ హాలులో జిల్లా కలెక్టర్ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఓటరు జాబితాల ప్రచురణ అనంతరం ఓటరు నమోదు, తొలగింపులు, సవరణల కొరకు అందిన ధరఖాస్తుల పరిష్కారం, ఈ.వి.యం. లు, వివిపాట్ ల వినియోగంపై ఓటరు అవగాహనా కార్యక్రమాల నిర్వహణ, తదితర అంశాలను వివరించారు. ఈ సందర్భంగా జిల్లాలోని 1637 పోలింగ్ కేంద్రాలన్నిటిలో ఫర్నిచర్, లైటింగ్, ర్యాంపులు, త్రాగునీరు, మరుగుదొడ్లు తదితర సదుపాయాలను కల్పించడం పూర్తయిందని ఆమె తెలిపారు. అలాగే జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజక వర్గాలలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ ల ఏర్పాటు పూర్తయిందని తెలిపారు.
ఎన్నికలకు సర్వం సిద్ధం… -కలెక్టర్ డా. కృతికా-

