సినీరంగంలో మరియు రాజకీయ రంగంలో చరిత్ర సృష్టించిన చరిత్రకారుడు స్వర్గీయ నందమూరి తారక రామారావుని కాకినాడ సిటీ మాజీ శాసన సభ్యులు వనమాడి కొండబాబు కొనియాడారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారకరామారావు వర్ధంతిని పురస్కరించుకుని కాకినాడ సిటీ నియోజకవర్గం సంతచెరువు సెంటర్ నందు ఆయన తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పేదలకు వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, బంగారు సత్యనారాయణ, SK రహీమ్, పొంగా బుజ్జి, చెక్క శ్రీనివాస్, అమలకంటి బలరాం, గుజ్జు బాబు, తదితురులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ వర్ధంతి సందర్బంగా పేదలకు వస్త్రాలు పంపిణీ… – కొండబాబు –

